Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

New Update
rains

rains

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ(AP-TG) లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో వరంగల్, కరీంనగర్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇది కూడా చూడండి: Union Home Minister Amit Shah: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి హోం మంత్రి అమిత్ షా

ఆంధ్రప్రదేశ్‌లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఈ అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల భారీగా కురిసే అవకాశం ఉందని కావున రైతులు వ్యవసాయం చేసేటప్పుడు పొలంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని అధికారులు తెలిపారు. 


తెలంగాణలో ఈ జిల్లాల్లో..

తెలంగాణలో వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజమాబాద్, ఆదిలాబాద్, యాద్రాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వర్షాల కారణంగా ఇటీవల కామారెడ్డి అతలాకుతలం అయ్యింది. కాబట్టి నదులు, వాగులు, వంకలు ఈ భారీ వర్షాలకు పొంగిపొర్లే అవకాశం ఉంది. వీటికి సమీపంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Chandra Grahan 2025: చంద్ర గ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు జాగ్రత్త.. ఈ తప్పులు అస్సలు చేయకూడదు..!

Advertisment
తాజా కథనాలు