Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వానలే వానలు

పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ కారణంగా ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం వల్ల హైదరాబాద్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

New Update
rains

rains

పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ కారణంగా ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం వల్ల హైదరాబాద్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రెండు రోజుల నుంచి రోజంతా పొడి వాతావరణం ఉంటుంది. కానీ సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం సమయాల్లో అధిక వర్షం కురవడంతో ప్రజలు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడెక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. 

ఇది కూడా చూడండి: Pulivendula ZPTC By election : పులివెందులలో నువ్వా..నేనా... బాబు, జగన్ కు ప్రతిష్టాత్మకంగా జెడ్పీటీసీ ఉప ఎన్నిక

తెలంగాణలో ఈ జిల్లాల్లో..

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల తెలంగాణలో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, ములుగు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. 

ఏపీలోని ఈ జిల్లాల్లో..
ఏపీలో విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే మత్స్యకారులు అసలు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రతీర ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలను సూచించారు. 

ఇది కూడా చూడండి:Kakinada: బోడి గుండుపై జుట్టు పెంచుతామంటూ.. కాకినాడలో కలకలం రేపుతున్న మరో కొత్త మోసం!

Advertisment
తాజా కథనాలు