AP Crime : ఏపీలో దారుణం.. భర్తను హత్య చేసి పరారైన భార్య
ఏపీ మరో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను చంపి పారిపోయింది ఓ భార్య. ఈ ఘటన కర్నూలు జిల్లా మద్దికేర మండలం, ఎం.అగ్రహారం గ్రామంలో చోటుచేసుకుంది.
ఏపీ మరో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను చంపి పారిపోయింది ఓ భార్య. ఈ ఘటన కర్నూలు జిల్లా మద్దికేర మండలం, ఎం.అగ్రహారం గ్రామంలో చోటుచేసుకుంది.
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన కేవలం 8 నెలలకే భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతులను చిరంజీవి, వెంకటలక్ష్మిగా గుర్తించారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం బాడవలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు తన తల్లిని రోకలిబండతో కొట్టి చంపాడు. మృతురాలు గర్నెపూడి సీతామహాలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు గర్నెపూడి రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా బాలరాజుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు సుడిగుండంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మృతులు సోంబత్తిన దిలీప్, కొత్తూరు చంద్రశేఖర్ రెడ్డి, పీనరోతు కేశవగా గుర్తించారు.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో కట్నం, భర్త అనుమానంతో వేధింపులు తాళలేక శ్రావణి అనే మహిళ బలవన్మరణంకు పాల్పడింది. తన తల్లిదండ్రుల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆమె ప్రాణాలు తీసుకుంది. చనిపోయే ముందు శ్రావణి తన బాధను వాయిస్ రికార్డు రూపంలో రికార్డు చేసింది.
విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో అలల తాకిడికి గురై ఓ మహిళ మరణించగా.. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన యువకుడు గల్లంతయ్యాడు. మృతురాలు సికింద్రాబాద్‌కు చెందిన వసంతగా గుర్తించారు. ఆమె కొడుకు ప్రమాదవశాత్తు అలల తాకిడికి లోపలికి కొట్టుకుపోయారు.
నెల్లూరు జిల్లా మూలపేటలోని అలంకార్ సెంటర్ వద్ద నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా చంపారు. మృతుడు లైక్ ఓమహిళను వేధిస్తున్నాడని.. ఈ వేధింపుల కారణంగానే ఈ అఘాయిత్యం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడులో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలిక అంజలిని గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా కారులో కిడ్నాప్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటాయపాలెం వద్ద రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు గండేపల్లి శంకర్, సువర్ణ రాజు, శ్రీనివాస్‌గా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.