AP Crime: ఏపీలో దారుణం.. భార్యను రోకలి బండతో హత్య చేసి గొంతు కోసుకున్న భర్త

ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రేగలగడ్డలో ఓ వ్యక్తి తన భార్యను రోకలి బండతో కొట్టి చంపి.. ఆపై తన గొంతు కోసుకున్నాడు. భార్యపై అనుమానం పెంచుకుని ఆరుబయట నిద్రిస్తున్న జయమ్మపై దాడి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
_ prakasham Crime News

prakasham Crime News

ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మర్రిపూడి మండలం రేగలగడ్డ గ్రామంలో ఓ వ్యక్తి తన భార్యను రోకలి బండతో కొట్టి చంపి.. ఆపై తన గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. రేగలగడ్డ గ్రామానికి చెందిన నారాయణ (50), జయమ్మ (45) దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురికి పెళ్లిళ్లు కావడంతో దంపతులు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. గత కొంతకాలంగా నారాయణ తన భార్యపై అనుమానం పెంచుకుని తరచు గొడవపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న జయమ్మపై నారాయణ రోకలి బండతో దాడి చేసి చంపాడు. ఆ తర్వాత తనూ గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

భార్యపై అనుమానంతో..


ఇది కూడా చదవండి: మెదక్ జిల్లాలో దారుణం - మూడేళ్ల కుమార్తెను చంపేసి ప్రియుడితో జంప్‌

శనివారం ఉదయం నారాయణ పరిస్థితి విషమంగా ఉండటంతో గ్రామస్తులు అతన్ని పొదిలి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ భార్య జయమ్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నారాయణ భార్యను హత్య చేసి ఆత్మహత్యకు యత్నించాడా..? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నారాయణకు ప్రస్తుతం పొదిలి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

ఇది కూడా చదవండి: నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతకం..బీ ఫార్మసీ విద్యార్థినిని కత్తితో పొడిచి..

Advertisment
తాజా కథనాలు