BIG BREAKING: నెల్లూరు ఫ్యాక్టరీలో పేలుడు.. స్పాట్లో ఐదుగురు.. అసలేమైందంటే?

నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం మంగళూరులో ఉన్న కలర్‌ షైన్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆదిత్య అనే వ్యక్తి మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిని చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

New Update
Color Shine factory fire accident

Color Shine factory fire accident

నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం మంగళూరు పంచాయతీ పరిధిలో ఉన్న కలర్‌ షైన్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో ఆదిత్య అనే వ్యక్తి మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆరుగురు కార్మికులు దానిలో చిక్కుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి వారిని బయటికి తీసినప్పటికీ.. అప్పటికే ఆదిత్య అనే వ్యక్తి మరణించినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలైన మిగిలిన ఐదుగురిని చికిత్స కోసం నెల్లూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

కలర్‌ షైన్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హ*త్య

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న రూరల్ సీఐ కిషోర్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం మీడియా వారిని లోపలికి అనుమతించకపోవడం గమనార్హం. సీఐ కిషోర్ బాబు చొరవతో లోపలికి వెళ్లినప్పటికీ.. అక్కడి సిబ్బంది మీడియా ప్రతినిధులు వీడియోలు తీయడానికి నిరాకరించారు. ప్రమాదానికి గల కారణాలు, ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాల పాటించడంలో లోపాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. మృతుడు, గాయపడిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో దారుణం.. భార్యను రోకలి బండతో హత్య చేసి గొంతు కోసుకున్న భర్త

Advertisment
తాజా కథనాలు