AP News: ఏపీలో గంజాయి మత్తులో యువకులు వీరంగం.. సోషల్ మీడియాలో దృశ్యాలు వైరల్
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని బొమ్మ కూడలిలో గంజాయి మత్తులో యువకులు కలకలం రేపారు. కాలేజీ బస్సులో వెళ్తున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, దుర్భాషలు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.