AP Govt: మహిళలకు అదిరిపోయే రాఖీ గిఫ్ట్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం!
మహిళలకు ఏపీ కేబినెట్ శుభవార్త చెప్పింది. రాఖీ పండుగ రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రకటన చేయాలని నిర్ణయించింది. అనంతరం 15నుంచి ఆ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
మహిళలకు ఏపీ కేబినెట్ శుభవార్త చెప్పింది. రాఖీ పండుగ రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రకటన చేయాలని నిర్ణయించింది. అనంతరం 15నుంచి ఆ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అకాంక్షించారు. ఈ రోజు అమరావతిలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశానికి వచ్చిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన అభినందించారు. సినిమా సూపర్ హిట్ కావాలంటూ చంద్రబాబు ఆకాంక్షించారు.
AP: రాష్ట్ర మంత్రి వర్గం మరోసారి భేటీ కానుంది. వచ్చే నెల 6న సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఈ భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే పలు అంశాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
ఈరోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. తొలిసారిగా ప్రభుత్వం e-కేబినెట్ నిర్వహిస్తోంది. నూతన మద్యం పాలసీ, రివర్స్ టెండరింగ్ రద్దు, ఇసుక పాలసీలో మార్పులు వంటి అంశాలతో పాటు పలు పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ఏపీ ప్రభుత్వం వివరించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విటర్లో పేర్కొన్నారు.అయితే ఆయన ట్విట్ ని కొద్దిసేపటికే డిలీట్ చేశారు.
AP: రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదంపై చర్చించనున్నట్లు సమాచారం.
AP: ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదంపై చర్చించనున్నట్లు సమాచారం.
AP: ఈనెల 24న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 10 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. కేబినెట్లో చర్చించాల్సిన ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇచ్చింది.