Andhra Pradesh : నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం కీలక చర్చలు. ఆంధ్రాలో నేడు కీలక సమావేశం జరగనుంది. ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం చర్చించనుంది. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని ఏపీ ఎన్జీవోలు అంటున్నారు. By Manogna alamuru 12 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి AP Government Discussion With JAC : ఐఆర్(IR), మధ్యంతర భృతి(Interim Employment) పై ప్రకటన చేయాలని... పెండింగ్ డీఏలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్(Retirement Benefits) విడుదల చేయాలని పట్టు బడుతున్నారు ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు. అ విషయమై నేడు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. మద్యాహ్నం 3.30 కి సచివాలయంలో 13 సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవనుంది. ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది. ఇవి సఫలం కాకపోతే ఉద్యమకార్యాచరణ అమలు చేస్తామని చెబుతోంది ఏపీ జేఏసీ. ఈ నెల 14 నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. Also Read : Bihar Floor Test : కాసేపట్లో బీహార్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్.. ఆ ఎమ్మెల్యేల ఫోన్లు స్విచ్ ఆఫ్! మొత్తం పక్కాగా ఉద్యమ కార్యాచరణ.. ఏది ఏమైనా తాము డిమాండ్ చేసిన వాటిని సాధించుకోవాలని గట్టిగా డిసైడ్ అయింది ఏపీ జేఏసీ. 104 ఉద్యోగ సంఘాలు, కార్యవర్గంతో చర్చలు జరిపామని... ఈ చర్చల్లో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 14న నల్ల బ్యాడ్జిలు ధరించి అన్ని ఆఫీసుల్లో మెమొరాండం ఇవ్వనున్నారు. తరువాత 15, 16 తేదీల్లో లంచ్ టైమ్లో నిరసన చేస్తామని... ఫిబ్రవరి 17న తాలూకా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తామని చెబుతున్నారు. ఇక ఫిబ్రవరి 20న కలెక్టరేట్ల దగ్గర ధర్నా... 21 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో పర్యటనలు చేస్తామని తెలిపారు. చివరగా ఫిబ్రవరి 27న చలో విజయవాడ(Chalo Vijayawada) నిర్వహిస్తామని చెప్పారు. ఇలా మొత్తం కార్యాచరణ సిద్ధంగా ఉందని... నెమ్మదిగా మొదలై తమ ఉద్యమం ఉధృత రూపం దాలుస్తుందని చెబుతున్నారు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించాలని అంటున్నారు. ఇవన్నీ చేసినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే మెరుపు సమ్మె చేపడతామని చెబుతోంది ఏపీ ఏజేసీ(AP JAC). తాము అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేస్తోంది. #ap-jac #demands #andhra-pradesh #ap-cabinet-meet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి