AP Govt: మహిళలకు అదిరిపోయే రాఖీ గిఫ్ట్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం!

మహిళలకు ఏపీ కేబినెట్ శుభవార్త చెప్పింది. రాఖీ పండుగ రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రకటన చేయాలని నిర్ణయించింది. అనంతరం 15నుంచి ఆ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

New Update
AP Rakhi 2025

మహిళలకు ఏపీ కేబినెట్ శుభవార్త చెప్పింది. రాఖీ పండుగ రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రకటన చేయాలని నిర్ణయించింది. అనంతరం 15నుంచి ఆ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫ్రీ బస్ కార్యక్రమంలో మంత్రులందరూ పాల్గొనాలని సూచించారు సీఎం. అయితే.. ఆ రోజు స్వాతంత్ర దినోత్సవం కావడంతో మంత్రులంతా బిజీ గా ఉంటారని పలువురు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయినా కూడా ప్రతీ ఒక్క మంత్రి టైమ్ అడ్జస్ట్ చేసుకుని ఫ్రీ బస్ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం స్పష్టం చేశారు. 

ఆటో డ్రైవర్లతో చర్చలు..

ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు ఉచిత ప్రయాణం ప్రారంభించక ముందే ఆటో డ్రైవర్లను పిలిపించి మాట్లాడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. మంత్రి మనోహర్ చేసిన సూచన మంచిదని సీఎం అభిప్రాయపడ్డారు. వెంటనే ఆటో డ్రైవర్లు ను పిలిపించి సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. వారికి తగిన సహాయం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సింగపూర్ పర్యటన గురించి మంత్రులకు వివరించారు సీఎం చంద్రబాబు. సింగపూర్ లో హౌసింగ్  ప్రాజెక్ట్ వంటి అభివృద్ధి అంశాలపై చర్చించారు.

జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి రామని చెప్పారన్నారు. సీడ్ క్యాపిటల్ లో భాగస్వామ్యం కాబోమని వారు అన్నట్లు చంద్రబాబు వివరించారు. గత జగన్ ప్రభుత్వ పెద్దలు సింగపూర్ కు వెళ్లి అక్కడి మంత్రులను బెదిరించారన్నారు. కేసులు పెడతాం అని బెదిరించి వాళ్లను భయపెట్టే పరిస్థితి అప్పుడు జరిగిందన్నారు. సింగపూర్ తో స్నేహ సంబంధాలు కొనసాగించాలని చెప్పామన్నారు. నూతన బార్ పాలసీని సైతం కేబినెట్ ఆమోదించింది. కల్లు గీత కార్మికుల కోసం కేటాయించిన షాప్ లలో బినామీలు వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు