AP CABINET MEET: నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ! AP: రాష్ట్ర మంత్రి వర్గం మరోసారి భేటీ కానుంది. వచ్చే నెల 6న సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఈ భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే పలు అంశాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. By V.J Reddy 27 Oct 2024 | నవీకరించబడింది పై 27 Oct 2024 14:32 IST in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి AP Cabinet Meet : నవంబర్ 6న ఏపీ కేబినెట్ మరోసారి సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే భేటీలో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే పలు అంశాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. కాగా నవంబర్ 2వ వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో బాబు సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఉచిత ఇసుక, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. Also Read : 'అమరన్' కోసం సాయి పల్లవి అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందా? రాష్ట్ర బడ్జెట్ పై చర్చ!... మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ పై చర్చించనున్నారు. కాగా పూర్తి స్థాయి బడ్జెట్‌ను నవంబరు రెండో వారంలో ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా గత ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను సమర్పించింది. కాగా మరో రెండ్రోజుల్లో దీనిపై బడ్జెట్ తేదీలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే అధికారులు ఆర్థిక బడ్జెట్ ను రెడీ చేసే పనిలో పడ్డారు. ఆర్థిక వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు తేదీలు ప్రతిపాదనకు వచ్చినట్లు తెలుస్తోంది. Also Read : ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను.. ఇటీవల ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మొత్తం రూ.2,86,389 కోట్లతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2024 ఏప్రిల్ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి మొత్తం 40 గ్రాంట్ల కింద రూ.1,09,052.34 కోట్లకు ఖర్చు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సాధించి జూన్ నెలలో అధికారంలోకి వచ్చింది. అయితే జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉండగా... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, ఎన్ని అప్పులున్నాయో తెలియని గందరగోళ పరిస్థితుల్లో.. పూర్తి వివరాలు రాబట్టి ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది. కాగా ఆ సమయంలో కూడా చంద్రబాబు సర్కార్ ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కాగా ఈ నవంబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. Also Read : వైద్యులు తెల్లకోటు ఎందుకు వేసుకుంటారో తెలుసా? Also Read : అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు #ap-assembly #chandrababu #ap-cabinet-meet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి