ఆ కులాన్ని కూడా ఎస్సీలో చేరుస్తున్నాం.. ! | CM Chandrababu Sensational Comments In Assembly | RTV
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైకోర్టు నూతన భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. శనివారం రూ.768 కోట్లతో శాసనసభ, రూ.1,048 కోట్ల అంచనా వ్యయాలతో హైకోర్టు బిల్డింగులు ఏజెన్సీల నుంచి బిడ్లు పిలిచారు. ఈ నెల 17 మధ్యాహ్నం 3గంటల వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చారు.
గవర్నర్ కు అసెంబ్లీ వేదికగా క్షమాపణలు చెప్పారు పవన్ కల్యాణ్. అసెంబ్లీలో వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ విజయవంతంగా ప్రసంగం పూర్తి చేశారని అన్నారు. వైసీపీ నేతల తీరుపట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లుగా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. నేటి నుంచి మార్చి 21 వరకు సమావేశాలు జరగనున్నాయి. మార్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. మార్చి 20, 21 రిజర్వ్ డేస్‌గా ప్రకటించారు. వారానికి 5రోజులు షెడ్యూల్ చేశారు.
జగన్ కు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఎక్కువ శాతం ఓట్ల వచ్చిన వారికి ఎక్కువగా మాట్లాడే ఛాన్స్ కేవలం జర్మనీలోనే ఉంటుందన్నారు. అలా కావాలంటే వైసీపీ జర్మనీకి వెళ్ళవచ్చని సెటైర్లు వేశారు పవన్.
నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా ఉండదని జగన్ అనలేదా? అని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. 11 స్థానాల్లో గెలిస్తే ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. అటెండెన్స్ కోసమే ఈ రోజు అసెంబ్లీకి వచ్చాడని సెటైర్లు విసిరారు.
ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని మొదలుపెట్టగానే వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డకున్నారు. ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హుందాగా వ్యవహరించాలని పవన్ జనసేన నేతలకు సూచించారు. వైసీపీ భాష, బురద రాజకీయాలు అనుసరించొద్దని హెచ్చరించారు. సభ్య మర్యాదను కాపాడుతూ.. జనసేన పార్టీ సామాన్యుడి గొంతుగా ఉండాలన్నారు.