/rtv/media/media_files/2025/09/19/cm-ap-2025-09-19-15-58-34.jpg)
ఏపీ అసెంబ్లీ(AP Assembly) లో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమా(Bonda Uma), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ల మధ్య ఆసక్తికకరమైన చర్చ నడిచింది. అసెంబ్లీలో ప్లాస్టిక్ నిషేధంపై చర్చ సందర్భంగా పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బోండా ఉమా ఆరోపించారు. విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కార్యాలయమే లేదని, ఫిర్యాదు కోసం వెళ్తే డిప్యూటీ సీఎం పవన్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ చెప్తేనే చేస్తామంటున్నారని మండిపడ్దారు.
Also read : TG Crime: ప్రాణం తీసిన పేకాట.. పోలీసులు రావడంతో పారిపోతుండగా హార్ట్ ఎటాక్!
బోండా ఉమ VS డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
— RTV (@RTVnewsnetwork) September 19, 2025
డిప్యూటీ సీఎం పవన్ పై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ పరోక్ష విమర్శలు చేశారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సరిగా పనిచేయడం లేదని, పీసీబీ చైర్మన్ పవన్ పేరు చెబుతున్నారని ఆరోపించారు.
దీనికి స్పందించిన డిప్యూటీ సీఎం పవన్, బోండా ఉమ వ్యాఖ్యలను… pic.twitter.com/l7osKTSAyP
పొల్యూషన్ బోర్డు పనితీరుపై ఉమా మండిపడ్దారు. విశాఖలో రాంకీ పరిశ్రమ నుంచి వ్యర్థ జలాలు..సముద్రంలోకి వదులుతున్నారని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు ఉమా. సీఎం చెప్పినా చర్యలు తీసుకోలేదంటే వాళ్ల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో అని అన్నారు. ఎంపీ అయోధ్య రామిరెడ్డి , ఛైర్మన్ కృష్ణయ్యను ఏం మ్యానేజ్ చేస్తున్నారో అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ కౌంటర్
బోండా ఉమకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. బోండా ఉమ మాటలు సరిద్దుకోవాలి అని అన్నారు. పొల్యూషన్ బోర్డు అందుబాటులో ఉండదు అనడం సరికాదన్నారు. రాంకీ సంస్థపై చర్యలు తీసుకున్నాం షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చామని సభకు తెలిపారు పవన్. పరిశ్రమలపై చర్యలు తీసుకుంటే వందల కుటుంబాలు రోడ్డున పడతాయన్న పవన్.. పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ పనిచేయదన్నారు. బోండా సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
Also Read : CM Reavnth Reddy : కేసీఆర్, ట్రంప్ ఒక్కటే.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్
పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ఇది సామాజిక బాధ్యత అని ఆయన అన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి. కృష్ణయ్య, అధికారులు పారిశ్రామిక వేత్తలను భయపెట్టే విధంగా కాకుండా, ప్రజల అనుమానాలకు సమాధానాలు ఇచ్చే విధంగా వ్యవహరించాలని సూచించారు. ఇక అసెంబ్లీలో ప్రసంగించేటప్పుడు ప్రతి సభ్యుడూ నిలబడి మాట్లాడే సంప్రదాయాన్ని పాటించాలని ఆయన సభ్యులను కోరారు. ఇది సభకు గౌరవం అని, సభా నియమాలను పాటించడం ముఖ్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.