BIG BREAKING: ఏపీలో రెండు కీలక బిల్లులకు ఆమోదం!

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు అసెంబ్లీలో రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ సవరణ బిల్లుతోపాటు గ్రామ, వార్డు సచివాలయం చట్ట సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

ఏపీ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు అసెంబ్లీలో రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ సవరణ బిల్లుతోపాటు గ్రామ, వార్డు సచివాలయం చట్ట సవరణ బిల్లులను కూడా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే ఆక్వా, సహకార శాఖలకు సంబంధించి చట్ట సవరణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. కూటమి ఎమ్మెల్యేల సపోర్ట్‌తోనే ఈ బిల్లులకు ఆమోదించారు.

ఇది కూడా చూడండి: Bathukamma 2025: చింతమడకలో ఎంగిలి పూలు.. లండన్ లో సద్దులు.. కవిత బతుకమ్మ షెడ్యూల్ వచ్చేసింది!

వీటితో మరో మూడు బిల్లులకు..

ఇదిలా ఉండగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేశ్ జూనియర్ కాలేజీల గురించి ప్రస్తావించారు. ఏపీలో మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో రాష్ట్రంలోని జూనియర్ కళాశాలను నాశనం చేశారని విమర్శించారు. అలాగే ఈ బిల్లులతో పాటు మరో మూడు బిల్లులకు కూడా అసెంబ్లీలో ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, భారతీయ నాగరిక్ సురక్షా సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అయితే స్థానిక సంస్థలకు నాలా ఫీజు ఇచ్చే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభలో ప్రవేశపెట్టారు. అలాగే ఏపీ వ్యవసాయ భూమి చట్టం 2006 రద్దు చేసేందుకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. 

ఇది కూడా చూడండి: Ponguleti: సుమన్ హీరోగా మంత్రి పొంగులేటి బయోపిక్.. సినిమాలో ఆ సీన్లే హైలైట్?

Advertisment
తాజా కథనాలు