/rtv/media/media_files/2025/02/25/T1pqgzk8zFghSyBZZMAw.jpg)
ఏపీ గవర్నర్ కు అసెంబ్లీ వేదికగా క్షమాపణలు చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అసెంబ్లీలో వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ విజయవంతంగా ప్రసంగం పూర్తి చేశారని అన్నారు. అసెంబ్లీలో ఎన్డీయే కూటమి సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు పవన్. వైసీపీ నేతల తీరుపట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లుగా వెల్లడించారు. వైసీపీ తీరు చూస్తుంటే వివేకా హత్య, చట్టాల ఉల్లంఘన, డా.సుధాకర్ హత్య, చంద్రబాబు అరెస్ట్ ఘటనలే గుర్తొస్తున్నాయన్నారు.
సీఎం చంద్రబాబుకు హ్యాట్సాఫ్
వైసీపీ తీరు చూస్తే పాలసీ టెర్రరిజం గుర్తుకువస్తుందని పవన్ విమర్శించారు. అసెంబ్లీలోనే వారి తీరు ఇలా ఉంటే బయట ఇంకెలా ఉంటారో అని సందేహం వ్యక్తం చేశారు.. గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బాయ్‌కాట్ చేయడం దురదృష్టకరమన్న పవన్.. గవర్నర్ కు మర్యాద ఇవ్వలేని ఆ పార్టీ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి వీలు లేదని మండిపడ్డారు. వైసీపీ పార్టీని ఐదేళ్లు తట్టుకుని నిలబడిన సీఎం చంద్రబాబుకు హ్యాట్సాఫ్ అని తెలిపారు. ఎమ్మెల్యేలు అందరికీ ఆదర్శంగా ఉండాలన్న పవన్.. . వైసీపీ నేతలు గొడవలు, బూతులకు పర్యాయపదాలుగా మారారని చెప్పారు. చట్టాలు చేయాల్సిన వాళ్లే నియమాలు ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదని పవన్ చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో 4వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం 18 వేల కిలో మీటర్ల సీసీ రోడ్లు మాత్రమే వేసిందన్నారు. తమ పాలనలో 22వేలకు పైగా గోకులాలు నిర్మించామని, ఒకేరోజు 13 వేల 326 గ్రామసభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఓ మంత్రి 77 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.