AP News: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ఎప్పటి వరకంటే..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. నేటి నుంచి మార్చి 21 వరకు సమావేశాలు జరగనున్నాయి. మార్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. మార్చి 20, 21 రిజర్వ్‌ డేస్‌గా ప్రకటించారు. వారానికి 5రోజులు షెడ్యూల్ చేశారు.

New Update
ap assembly (1)

ap assembly (1) Photograph: (ap assembly (1))

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమైయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ప్రసంగం మధ్యలోనే వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతపక్ష హోదా కావాలని ఆందోళన చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేసి సభ నుంచి వాకౌట్ చేశారు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు. తర్వాత గవర్నర్ ప్రసంగం పూర్తైంది.

ఇది కూడా చదవండి: SLBC tunnel: 40ఏళ్ల నాటి ఆలోచన ఇంకా ఆచరణలోకి రాలే.. SLBC ప్రాజెక్ట్ హిస్టరీ ఇదే..!!

తదనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్, అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేశారు. మార్చి 21 వరకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు నిర్వహించనున్నారు. మార్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. మార్చి 20, 21 రిజర్వ్‌ డేస్‌గా ప్రకటించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ 19 నాటికి పూర్తి కాకపోతే మరో రెండు రోజులు 20, 21తేదీల్లో కూడా సమావేశాలు జరపాలని నిర్ణయించుకున్నారు. వారానికి ఐదు రోజుల పాటు సభ నడిచే విధంగా షెడ్యూల్ చేశారు. వారానికి ఐదు రోజుల పాటు సభ నడిచే విధంగా షెడ్యూల్ చేశారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో సమావేశాలు ఉండవు.

ఇది కూడా చదవండి: Sridevi Death Anniversary: 7ఏళ్లు దాటినా వీడని శ్రీదేవి మరణం మిస్టరీ.. బాత్‌టబ్‌లో ముంచి చంపేశారా?

Advertisment
తాజా కథనాలు