AP అసెంబ్లీలో వైసీపీకి బిగ్ షాక్.. ఇక నుంచి అసెంబ్లీలోపలికి వస్తేనే లెక్క!

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ విధానం అమల్లోకి రానుంది. ఇకపై సభ్యుల హాజరు నమోదు ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతతో జరగనుంది. సభ్యులు అసెంబ్లీకి వచ్చి సభ లోపల తమ స్థానాల్లో కూర్చున్న తర్వాత వారి అటెండెన్స్ నమోదు అవుతుంది.

New Update
AP assembly

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ విధానం అమల్లోకి రానుంది. ఇకపై సభ్యుల హాజరు నమోదు ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా జరగనుంది. సభ్యులు అసెంబ్లీకి వచ్చి సభ లోపల తమ స్థానాల్లో కూర్చున్న తర్వాత మాత్రమే వారి అటెండెన్స్ నమోదు అయ్యే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఇటీవల కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ సీఎం జగన్ సభకు రాకుండానే హాజరు పట్టికలో సంతకం చేస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపించాయి. కొందరు సభ్యులు అసెంబ్లీ భవనానికి వచ్చి.. లోపలికి వెళ్లకుండానే సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారనే చర్చ కూడా సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఆరు నెలలకు ఓ సారైనా అసెంబ్లీకి హాజరు కావాలనే రూల్ ఉంది. దీంతో ఇక MLA అయినా కచ్చితంగా అసెంబ్లీలోపలికి రావాల్సిందే. సభలో వారికి కేటాయించిన స్థానంలో కుర్చుంటేనే అసెంబ్లీకి వచ్చినట్లు. ఈక్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాడా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకే పరిమితం కావడంతో, జగన్‌కు టెక్నికల్‌గా ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత, ఆయన కేవలం రెండు లేదా మూడు సార్లు మాత్రమే అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చారు. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల సమయంలో గవర్నర్ ప్రసంగానికి హాజరై, సభలో కేవలం 10-15 నిమిషాలు మాత్రమే ఉండి, నిరసన తెలిపి బయటకు వచ్చారు. ప్రస్తుతం (ఫిబ్రవరి 2026 బడ్జెట్ సమావేశాలు) కూడా ఆయన అసెంబ్లీకి హాజరవుతారని వార్తలు వస్తున్నాయి, కానీ తనకు 'ప్రతిపక్ష హోదా' ఇస్తేనే సభలో పూర్తిస్థాయిలో పాల్గొంటానని ఆయన స్పష్టం చేశారు.

కొత్తగా తీసుకొచ్చిన అటెండెన్స్ విధానంతో జగన్ అసెంబ్లీలోపలికి రావాల్సిందే. ఇకపై సంప్రదాయంగా ఉపయోగిస్తున్న హాజరు రిజిస్టర్ విధానం ఉండదని అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ ప్రసన్న కుమార్ నిన్న విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపారు. సభ్యుల హాజరు వ్యవస్థను పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా మార్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు వ్యవస్థ అమలు అసెంబ్లీ కార్యకలాపాల్లో క్రమశిక్షణ పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ విధానం ఇతర శాసనసభల్లో కూడా అమలు అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు