వైఎస్ జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం
మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాద ఘటన జరిగింది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఇంటి పక్కన ఉన్న గార్డెన్లో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు.