/rtv/media/media_files/2025/04/18/LHTag08SBcJQkTk94KHG.jpg)
Indigo summer sale
ఇండిగో సంస్థ సమ్మర్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. వేసవిలో ఎక్కడికైనా వెళ్లాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఇండిగో సమ్మర్ సేల్ పేరుతో బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణాన్ని కల్పించడంతో పాటు కొన్ని రకాల సేవలపై 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. మీరు ఈ సమ్మర్ సేల్ ద్వారా ఇండిగో కేవలం రూ.1499కే విమాన ప్రయాణం చేయవచ్చు. అయితే ఈ సేల్ ఏప్రిల్ 18 అనగా నేటి అర్థరాత్రితో పూర్తి అవుతుంది.
IndiGo's Summer Sale is live. Enjoy an additional 5% off on Economy fares and flat 25% off on IndiGoStretch.
— IndiGo (@IndiGo6E) April 15, 2025
🍽️ Get 10% off on pre-booked meals.
📱Save up to 50% on select 6E add-ons.
💺 Get XL seats starting at ₹699.
Book now: https://t.co/dUlwLc16Tw. #goIndiGo pic.twitter.com/Mi9z0zB21f
ఇది కూడా చూడండి: Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!
దేశీయ ఎకానమీ క్లాస్ టికెట్ ధర..
ఇండిగో ఎయిర్ లైన్స్ తీసుకొచ్చిన దేశీయ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు రూ.1499కే ఈ సేల్‌లో ఇస్తోంది. కడప, హైదరాబాద్, కర్నూలు, చెన్నైల మధ్య రూ.1499కే ప్రయాణం చేయవచ్చు. విదేశీ ప్రయాణాలు అయితే రూ.4999 అవుతుంది. అయితే విమాన ప్రయాణానికి వారం రోజులు ఉందనగా.. బుక్ చేసుకోవాలి. మీరు ఈ రోజు బుక్ చేసుకుంటే కనీసం వారం తర్వాత మీ ప్రయాణం ఉండాలి.
ఇది కూడా చూడండి: Cinema: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం
ఇవే కాకుండా ప్రీ పెయిడ్ అదనపు బ్యాగేజీపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. అయితే టికెట్లు బుక్ చేసుకోవడానికి goindigo.in వెబ్‌సైట్ లేదా ఇండిగో యాప్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవాలి. లేదంటే మీరు ఇండిగో ఏజెంట్ల ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.