Nellore Murders: కత్తులతో పొడిచి..గుండెను చీల్చి .. నెల్లూరులో దారుణ హత్యలు

నెల్లూరులో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏకంగా రెండు హత్యలతో నెల్లూరు నగరం ఉలిక్కిపడుతోంది. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. అయ్యప్ప గుడి సెంటర్లో బక్షు అనే వ్యక్తిని అతికిరాతకంగా పొడిచి పొడిచి  మరి చంపేశారు.

New Update

నెల్లూరులో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏకంగా రెండు హత్యలతో నెల్లూరు నగరం ఉలిక్కిపడుతోంది. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. అయ్యప్ప గుడి సెంటర్లో బక్షు అనే వ్యక్తిని అతికిరాతకంగా పొడిచి పొడిచి  మరి చంపేశారు గుర్తు తెలియని యువకులు. మద్యం మత్తులో విచక్షణా రహితంగా గుండెలపై పొడిచారు యువకులు. వెంటనే స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగానే బక్షు మృతి చెందాడు. ఇక మరో ఘటనలో మారుతి నగర్ ప్రాంతంలో సుల్తాన్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో సుల్తాన్‌ను కత్తితో పొడిచారు ఇద్దరు వ్యక్తులు. వరుస హత్యలతో నెల్లూరు జనం వణికిపోతున్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు