/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Holidays-5-jpg.webp)
School Holidays
సెలవులు వస్తున్నాయంటే విద్యార్థులకు పండగే. అందులోనూ వరుసగా రెండు లేదా మూడు రోజులు సెలవులు ఉంటే విద్యార్థుల ఆనందానికి అసలు అవధులు ఉండవు. అయితే ఏప్రిల్ 18వ తేదీన గుడ్ ఫ్రైడే కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు సెలవు. మధ్యలో శనివారం స్కూల్ ఉండగా.. ఆదివారం మళ్లీ సెలవు. శుక్రవారం గుడ్ ఫ్రైడే, శని, ఆదివారం వీకెండ్ హాలీడే కావడం వల్ల కార్పొరేట్ కంపెనీలకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు ప్రకటించారు.
ఇది కూడా చూడండి: DC VS RR: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి
సిలబస్‌లో మార్పులు చేయనున్నట్లు..
ఇదిలా ఉండగా ఇంటర్ సిలబస్‌ను తెలంగాణ బోర్డు మార్చడానికి సిద్ధమవుతుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ సిలబస్ మారనుంది. పూర్తి స్థాయిలో మార్పు చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డు, కొత్త విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది. అధికారికంగా సిలబస్‌ను ఫైనల్ చేశారు. ఇది 2025-2026 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది.
ఇది కూడా చూడండి: Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!
ఈ మార్పులు కేవలం సిలబస్ పరిమితిలోనే కాకుండా, పరీక్షా విధానంలోనూ మారనున్నాయి. ఇప్పటివరకు పూర్తిగా ఎక్సటర్నల్ పరీక్షల ఆధారంగా జరిగే ఇంటర్ పరీక్షలు ఇక 80 మార్క్స్ ఎక్సటర్నల్, 20 మార్క్స్ ఇంటర్నల్ పద్ధతిలో జరగనున్నాయి. ఇది ముఖ్యంగా ఆర్ట్స్ కోర్సులు, లాంగ్వేజ్ సబ్జెక్టులకు వర్తించనుంది. ఈ నిర్ణయంతో విద్యార్థుల నిర్ధారిత మార్కుల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.
ఇంటర్ సిలబస్‌లో మార్పుకి ప్రభుత్వం ఇంకా తుది ఆమోదం అయితే ఇవ్వలేదు. అయితే ఈ మార్పులకు ముందుగా విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని పలువురు విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఈ ఇయర్ సిలబస్ విషయంలో విద్యార్థులకు కొత్త సవాళ్లు మొదలుకానున్నాయి.
ఇది కూడా చూడండి: Telangana: గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు