/rtv/media/media_files/2025/04/17/UrdufHeenfCwZ285uiFa.jpg)
anusha case updates
విశాఖ గర్భిణి అనూష హత్య కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మూడేళ్ల కిందట అనూషను జ్ఞానేశ్వర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనూష తండ్రి చనిపోవడం, తల్లి అంధురాలు కావడంతో అనూషను శారీరకంగా వాడుకునేందుకు జ్ఞానేశ్వర్ మాస్టర్ ప్లాన్ వేశాడు. అనూషకు మాయమాటలు చెప్పి లవ్ లో పడేసి పెళ్లికి ఒప్పించాడు. జ్ఞానేశ్వర్ ఒత్తిడితో పెళ్లికి అనూష కూడా రెడీ అయిపోయింది. పెళ్లై రెండేళ్లైనా ఇంట్లో మంచం, కంచాలు తప్ప ఏమీ కొనలేదు. తమ సంబంధం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు అనూషతో కూడా ఫొటోలు కూడా ఎక్కువగా తీసుకోలేదు. పెళ్లికి ముందే జ్ఞానేశ్వర్‌కు మరొక వివాహితతో అక్రమ సంబంధం కూడా ఉంది.
అనూషను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని
అయితే అనూషను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసిన జ్ఞానేశ్వర్ .. తనకు క్యాన్సర్ ఉందంటూ, తన పేరెంట్స్ ఒప్పుకోరని నమ్మించే ప్రయత్నం చేశాడు. విడాకులు ఇవ్వాలంటూ నిత్యం అనూషకు వేధింపులకు గురి చేశాడు. గర్భిణీగా ఉండగానే ఓసారి ఫలూదాలో నిద్రమాత్రలు కలిపాడు. అయితే అవి కరగకపోవడంతో ఆమె గుర్తించి అడగ్గా ఏమో తనకు తెలియదంటూ బుకాయించాడు. విడాకుల విషయంలో డెలివరీ ముందురోజు అనూషతో జ్ఞానేశ్వర్ ఘర్షణకు దిగాడు. రాత్రి పడుకున్నాక అనూష గొంతు నులిమి చంపేశాడు జ్ఞానేశ్వర్.
కేజీహెచ్ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు జ్ఞానేశ్వర్ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.
Also Read : భర్తతో 20ఏళ్లు గ్యాప్.. క్లాస్మెట్తో శారీరక సుఖం.. అమీన్పూర్ కేసులో సంచలన నిజాలు!