🔴Live News: సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెండ్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
అన్నమయ్య జిల్లా రాజంపేట జైల్లో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే జైలు అధికారులు ఆయన్ను రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా పోసానికి నిన్న కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మార్చిలోగా నామినేటెడ్ పదవుల భర్తీ, మేలో జరగనున్న మహానాడు నాటికి పార్టీ కమిటీలు పూర్తి చేస్తామన్నారు. నామినేటెడ్ పదవుల కోసం ఎమ్మెల్యేలతో తిరిగే వాళ్లకి కాకుండా పార్టీ కోసం కష్టపడ్డవారిని ఎంపిక చేయాలన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.వైఎస్ సునీత, సీబీఐ ఏఎస్పీ రాంసింగ్ బెదిరిస్తున్నారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవి తప్పుడు ఆరోపణలంటూ పోలీసులు కేసు నమోదు చేయగా కోర్టు కొట్టేసింది.
ఏపీ ప్రభుత్వ తీరుపై వైఎస్ షర్మిల ఫైరయ్యారు. ఏడాదికి రూ.5 వేల కోట్ల ధరల స్థిరీకరణ కోసం కేటాయించి గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోండని అన్నారు. జగన్ ఏడాదికి రూ.3 వేల కోట్లతో నిధి అని మోసం చేశారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారడం లేదన్నారు.
వల్లభనేని వంశీ అరెస్ట్ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకు వంశీ జైలుకు వెళ్లాడన్నారు. తప్పు చేసిన వైసీపీ నేతలందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామని స్పష్టం చేశారు. వంశీపై కూడా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీ ఆరోపణలు ఎదురుకుంటున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్ నాలుగు రోజుల క్రితం తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. సత్యవర్ధన్ ను బెదిరించి కొత్త అఫిడవిట్ వేయించారని వంశీపై కేసు నమోదయింది.
కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తీవ్రంగా విమర్శించారు. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించే వారిని తొక్కి నార తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
నిన్న విడుదల చేసిన మంత్రుల ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ఎవరినీ తక్కువ చేయడానికి కాదని స్పష్టం చేశారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పనిచేస్తారన్నారు.