CM Chandra Babu: నామినేటెడ్‌ పదవులు వాళ్లకే.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మార్చిలోగా నామినేటెడ్‌ పదవుల భర్తీ, మేలో జరగనున్న మహానాడు నాటికి పార్టీ కమిటీలు పూర్తి చేస్తామన్నారు. నామినేటెడ్ పదవుల కోసం ఎమ్మెల్యేలతో తిరిగే వాళ్లకి కాకుండా పార్టీ కోసం కష్టపడ్డవారిని ఎంపిక చేయాలన్నారు.

New Update
CM Chandra Babu Naidu

CM Chandra Babu Naidu

సీఎం చంద్రబాబు (Chandrababu) కీలక ప్రకటన చేశారు. మార్చిలోగా నామినేటెడ్‌ పదవుల (Nominated Posts) భర్తీ, మేలో జరగనున్న మహానాడు నాటికి పార్టీ కమిటీలు పూర్తి చేస్తామన్నారు. నామినేటెడ్ పదవుల కోసం ఎమ్మెల్యేలతో తిరిగే వాళ్లకి కాకుండా పార్టీ కోసం కష్టపడ్డవారిని ఎంపిక చేయాలని సూచించారు. ఆలయ కమిటీ ఛైర్మన్, ఏఎంసీ కమిటీలు మార్చిలోపు పూర్తి చేస్తామని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా పార్టీ సభ్యత్వాలు కూడా కోటి దాటాయన్నారు. అసెంబ్లీ కమిటీ హాలులో శుక్రవారం ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీలు,ఎమ్మెల్సీలతో కలిసి సమావేశమయ్యారు. 

Also Read: స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. ఆ రోజు నుంచే ఏపీలో ఒంటిపూట బడులు

CM Chandrababu Key Comments On Nominated Posts

ఈ సందర్భంగా సీఎం కీలక సూచనలు చేశారు.  ‘నేను రుణపడి ఉంది కార్యకర్తలకే. కేడర్‌ను కాపాడుకోవడం మన బాధ్యత. నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నేతలతో సమావేశాలు నిర్వహించండి. పంచాయతీ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలతో సమావేశం నిర్వహించాలి. మనల్ని నమ్ముకున్న వారిని మనం గౌరవించాలి. పార్టీకి బీసీలు వెన్నెముకగా ఉంటూ వస్తున్నారు. అందుకే ఎస్టీ, ఎస్సీలతో పాటు బీసీలకు కూడా ఇంటి నిర్మాణానికి రూ.50 వేలు అదనంగా ఇవ్వబోతున్నాం. దీనికి రూ.2 వేల కోట్ల అదనంగా ఖర్చు అవుతుందని అధికారులు చెప్పారు. ఎంతైనా పర్వాలేదని ఈ నిర్ణయం తీసుకున్నాం. 

Also Read :  తెలంగాణ లో అదుపుతప్పుతున్న శాంతి భద్రతలు

ఎంతో కసరత్తు చేసి బడ్జెట్ ప్రవేశపెట్టాం. సూపర్-6 హామీల అమలకు ప్రాధాన్యం ఇచ్చాం. పెన్షన్లకే ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్ని నెలలో మొదటి తేదీన ప్రజల్లోకి వెళ్లి వివరించాలి. త్వరలో ఎమ్మెల్యేలతో ముఖాముఖి నిర్వహిస్తా. మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలవాలి అనుకుంటే ప్రతిష్టను పెంచుకోవాలి. కేంద్రమంత్రులు కూడా నెలకు రెండుమూడు సార్లు జిల్లాలకు వెళ్లి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు.

Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్‌ రిలీఫ్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

 ఇప్పుడు మనం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రజల్లో చర్చించాలి. అన్నదాత, తల్లికి వందనం పథకాలకు నిధులు కేటాయించాం. మే నుంచి వాటిని అమలు చేస్తాం. మత్య్సకారులకు వేట నిషేధ సమయంలో రూ.20 వేలు ఇవ్వబోతున్నాం. విధి విధానాలు తయారు చేశాక మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకం కూడా అమలు చేస్తాం. 2029 నాటికి ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయం, పీఎం సూర్యఘర్, పైపుద్వారా గ్యాస్ సరఫరా, మరుగుదొడ్డి, ఇంటర్నెట్ అందిచాల్సి ఉంది. ప్రతి గ్రామంలో రోడ్లు, లైట్లు, చెత్త సేకరించి పోల్యూషన్ లేకుండా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. వివేకా హత్య ఘటన.. కుట్ర రాజకీయాలకు ఒక కేస్ స్టడీ. ఇలాంటి కుట్రలు, మోసం, ఫేక్ రాజకీయ సిద్దాంతంగా పెట్టుకున్న వాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలి.

Also Read :  తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్

మరో 2 నెలల్లో రోడ్లపై గుంతలు లేకుండా చేస్తాం. ఇప్పటికే 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి. వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడటం కాదు...వినియోగించుకోవాలి. ఇప్పటికే 161 సేవలు తీసుకొచ్చాం...వాటిని 500కు పెంచుతాం. దీనిపై మీరు కూడా ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి.   కేంద్రం రూ.27 వేల కోట్లు జల్ జీవన్ మిషన్‌కు కేటాయించింది. ఏపీలో ప్రతి ఇంటికి నీరివ్వాలంటే అదనంగా రూ.55 వేల కోట్లు కావాలని'' సీఎం చంద్రబాబు అన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు