/rtv/media/media_files/2025/03/21/zmIDQ5k5HZYQxaGZu0Rw.jpg)
Varma Vs Nagababu
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన X ఖాతాలో చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, మోదీ ఫొటోలతో ఆయన పోస్ట్ చేశారు. ప్రజలే నా బలం అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టారు. ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన జనసేన మీటింగ్ లో నాగబాబు వర్మను టార్గెట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఇక్కడ పవన్ ను ఎమ్మెల్యేగా గెలిపించింది.. పవన్ ఇమేజ్, అభిమానులు, ప్రజలు మాత్రమేనని నాగబాబు వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!
నా ప్రజలే నా బలం... pic.twitter.com/iC1GxI4CJt
— SVSN Varma (@SVSN_Varma) March 21, 2025
అంతే కానీ ఎవరైనా తమ కారణంగానే పవన్ గెలిచాడని భావిస్తే అది వారి కర్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వర్మను టార్గెట్ చేసే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ ఆ సమయంలో తీవ్రంగా సాగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజలే నా బలం అంటూ వర్మ తన అధికారిక X ఖాతాలో చేసిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ట్వీట్ ద్వారా వర్మ నాగబాబుకు కౌంటర్ ఇచ్చారన్న చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!
పిఠాపురం టౌన్ 23వ వార్డు రాంబాబు కుటుంబ సభ్యులకు రూ.99,553 మరియు 24వ వార్డు పార్టీ కార్యకర్త కోన సత్యవతికి మంజూరైన రూ.1,55,000 CMRF చెక్కులను అందజేయడం జరిగింది. pic.twitter.com/eNv0UHHHw4
— SVSN Varma (@SVSN_Varma) March 20, 2025
Also Read : కర్ణాటకలో హనీట్రాప్ దుమారం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య
టీడీపీ కేడర్ కు రక్షగా..
గతంలో ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర వర్మకు ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ పొత్తుల్లో భాగంగా కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించినా.. టీడీపీ క్యాడర్ మాత్రం చెక్కు చెదర కుండా వర్మ పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలే నా బలం అంటూ ఆయన పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read : హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు బాధాకరం.. మైనర్ బాలిక ఇష్యూపై కేంద్రమంత్రి అసహనం!
telugu breaking news | latest-telugu-news | nagababu | today-news-in-telugu | andhra-pradesh-politics | cm-ramesh