Doctors: అల్లు అర్జున్ ఆ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ..!
బేగంపేట్ కిమ్స్- సన్షైన్ ఆస్పత్రిలో బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఓ రోగికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. చికిత్స సమయంలో రోగిని మెలకువగా ఉంచేందుకు 'పుష్ప' సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేశారు. ఈ శస్త్ర చికిత్స రెండు గంటలపాటు కొనసాగింది.