/rtv/media/media_files/2024/12/01/vNJMhhpDMqgMjZKbJEWv.jpg)
ప్రస్తుతం ఇండస్ట్రీలో 'పుష్ప2' మేనియా నడుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ ఏకంగా 12000 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
రెమ్యునరేషన్ లో బన్నీ రికార్డ్..
ఈ నేపథ్యంలో సినిమా కోసం అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 'పుష్ప2' కోసం బన్నీ ఏకంగా రూ.240 కోట్లకి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో ఒక సినిమాకు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం విశేషం. కాగా టాలీవుడ్ లో ఇప్పటివరకూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోలలో అల్లు అర్జున్ తరువాత ప్రభాస్, తారక్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ టాప్ 5 స్థానాల్లో ఉన్నారు.
Also Read : ధనుష్ తో వివాదం.. దెబ్బకు సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేసిన నయనతార భర్త
'పుష్ప2' సినిమాకి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. (బెనిఫిట్ షో) రాత్రి 9.30 షోకు టికెట్ ధరను అదనంగా రూ.800 పెంచింది.
ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే. ఈ పెంపుతో సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర సుమారు రూ.1000గా, మల్టీప్లెక్స్‌లో రూ.1200లకు పైగా అవుతోంది.
Also Read : కాబోయే కోడలికి నాగార్జున కాస్ట్లీ గిఫ్ట్.. ఏంటో తెలుసా?