పుష్ప-2పై టీడీపీ ఎంపీ ట్వీట్.. వెంటనే డిలీట్

టీడీపీ ఎంపీ, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి పుష్ప-2 సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ కావాలని కాస్త వెటకారంగా ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొద్ది సమయానికే ట్వీట్‌ను ఎడిట్ చేసి డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

New Update
MP Byreddy sabari

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి టీడీపీ ఎంపీ, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనం రేపుతోంది. అయితే ఈ ట్వీట్ చేసిన కొంత సమయానికి ఆమె ఎడిట్ చేశారు. ఆ తర్వాత పూర్తిగా డిలీట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Ap News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు..ఇక నుంచి ఆ విషయంలో జాగ్రత్త!

పోస్ట్ ఏం చేశారంటే?

ఇంతకీ ఏమని పోస్ట్ చేశారంటే.. అల్లు అర్జున్ నంద్యాలలో మీరు చేసిన ఎలక్షన్ క్యాంపెయిన్‌ను ఇంకా జనాలు మర్చిపోలేదు. నంద్యాలలో ఎలాగైతే ప్రీ ఎలక్షన్ ఈవెంట్ నిర్వహించారో.. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తారని భావిస్తున్నాం. నంద్యాల వెళ్లాలనే మీ సెంటిమెంట్ మాకు బాగా వర్క్ అయ్యింది.

ఇది కూడా చూడండి: Health Tips: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు పిల్లలకు శాపమా?

ఇప్పుడు మీ సెంటిమెంట్ మాది కాబోతుంది. పుష్ప 2 సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ కావాలని కాస్త వెటకారంగా చేశారు. అయితే ఈ పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే దాన్ని ఎడిట్ చేసి, మళ్లీ డిలీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: Health Tips: ఈ మూడు తింటే కొవ్వంతా కరగాల్సిందే

ఇదిలా ఉండగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు అయిన శబరి మొదటి బీజేపీలో ఉండేవారు. ఆ తర్వాత టీడీపీలో ఎంపీ టికెట్ రావడంతో ఆమె మారారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె భారీ మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడికి సపోర్ట్‌గా హీరో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన సంగతి తెలిసిందే. 

ఇది కూడా చూడండి: AP Rains: ఏపీలో భారీ వర్షాల ఎఫెక్ట్.. నేడు స్కూళ్లకు సెలవు

#Allu Arjun
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు