‘పుష్ప2’ యూనిట్‌కి తెలంగాణ ప్రభుత్వం షాక్.. అనుమతి నిరాకరణ!

పుష్ప 2 మూవీ యూనిట్‌కి షాక్ తగిలింది. రేపు హైదరాబాదులోని మల్లారెడ్డి కాలేజీలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించింది. చివరి నిమిషంలో ఈడి రైడ్స్ నేపథ్యంలో ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో డిసెంబర్ 2న యూసఫ్‌గూడలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

New Update
pushpa 2.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న  మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2’. భారీ అంచనాలతో డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా.. ఎప్పుడెప్పుడు ఇందులో బన్నీ మాస్ యాక్షన్ వీక్షిద్దామా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. 

ఇక రిలీజ్‌కు మరికొద్ది రోజులే ఉండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే పలు రాష్ట్రాల్లో ఈవెంట్లు నిర్వహించి రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించనున్నట్లు మేకర్స్ ఇటీవల తెలిపారు. 

అందులో తెలంగాణాలోని హైదరాబాద్‌లో రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ఇటీవల తెలిపారు. దీంతో పుష్ప మూవీ యూనిట్‌ని చూసేందుకు బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రెడీ అయ్యారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

అయితే ఇప్పుడు ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఈడి రైడ్స్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఈ ఈవెంట్ ఎక్కడ నిర్వహించాలా అని మళ్లీ మూవీ యూనిట్ సందిగ్దంలో పడింది. ఇక చివరికి యూసఫ్ గూడా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో రేపు ఈవెంట్ నిర్వహించేందుకు పుష్ప యూనిట్ ప్రయత్నాలు చేసింది. 

Also Read: మేనమామ కాదు కాలయముడు..ఆస్తి కోసం దారుణం

కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ ఈవెంట్ రేపు (ఆదివారం) కాకుండా సోమవారానికి వాయిదా వేశారు. డిసెంబర్ 2వ తేదీన 6 గంటలకు యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు