Pushpa 2 : టాలీవుడ్ లో బాయ్ కాట్ 'పుష్ప2' ట్రెండ్.. కారణం అదే!

టాలీవుడ్ లో బాయ్ కాట్ పుష్ప2 ట్రెండ్ అవుతోంది. టిక్కెట్ రేట్లు భారీగా పెంచడమే ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. మల్టీప్లెక్స్ లో 500 నుంచి 1000, సింగిల్ స్క్రీన్లలో 400 వరకు టికెట్ రేట్లున్నాయి. సినిమాకు ఇంత ఖర్చుపెట్టలేమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Update
pushpa2 (2)

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప2' మరో మూడు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. సౌత్ తో పాటూ నార్త్ లోనూ ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. టికెట్లు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 

Also Read : 'పీలింగ్స్' సాంగ్ వచ్చేసింది.. ఎనర్జిటిక్ స్టెప్పులతో దుమ్ములేపిన బన్నీ

బాయ్ కాట్ పుష్ప-2..

హిందీ రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ భారీగా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా తెలంగాణలో మాత్రం 'బాయ్ కాట్ పుష్ప-2' ట్రెండ్ అవుతోంది. టిక్కెట్ రేట్లను భారీగా పెంచడమే ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. మల్టీప్లెక్స్ లలో రూ.500 నుంచి రూ.1000 మధ్యలో, సింగిల్ స్క్రీన్లలో సుమారు రూ.400 వరకు 'పుష్ప2' టికెట్ రేట్లున్నాయి. 

ఇది కాస్త సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారుతుంది. అభిమాన హీరో సినిమాను థియేటర్ లో చూద్దామన్నా అంత మొత్తం ఖర్చు చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో సినిమాకు ఇంత ఖర్చుపెట్టలేం అంటూ పలువురు ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ తక్షణమే టికెట్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో 'బాయ్ కాట్ పుష్ప2' హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. మరి దీనిపై మూవీ టీమ్ ఏమైనా రియాక్ట్ అవుతుందేమో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు