Pushpa 2: 'పుష్ప2' కు రేవంత్ గుడ్ న్యూస్.. వాటికి పర్మిషన్ గ్రాంటెడ్

'పుష్ప2' టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ ధరలతో పాటూ డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోల టికెట్ ధర రూ.800 ఖరారు చేసింది.

New Update
allu arjun22

'పుష్ప2' మూవీ టీమ్ కు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబరు 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ ధరలతో పాటూ డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. 

టికెట్ రేట్లు ఎంతంటే?

ఈ బెనిఫిట్ షోల టికెట్ ధర రూ.800 ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే రూ.800గా టికెట్‌ ధర నిర్ణయించారు. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. 

Also Read: బైక్‌ను తప్పించబోయి బస్సు బోల్తా... అక్కడికక్కడే 10 మందికి పైగా మృతి

 Also Read : మూడు వారాలకే ఓటీటీలోకి 'మట్కా'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

publive-image

Also Read :  ఎన్నికల ఫలితాలపై మీ అనుమానాలు వింటాం.. కాంగ్రెస్‌కు ఈసీ పిలుపు

Advertisment
Advertisment
తాజా కథనాలు