Air India: ఎయిర్ ఇండియా ఫ్లైట్లకు కొత్త రూపు రేఖలు... సీట్లు, కర్టెన్ల నుంచి టాయిలెట్ల వరకు..
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తన సర్వీసులను ఆధునికరించనుంది. వాటిలో సౌకర్యం, సాంకేతిక నైపుణ్యాన్ని నిర్ధారించడానికి అధునాతన డిజైన్లతో పునరుద్ధరింప జేయడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా వాటిలో ఆధునిక సౌకర్యాలను మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తోంది.