/rtv/media/media_files/2025/04/09/V64Fmxrr2YerY3SYTfEA.jpg)
Air India
Air India : దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వరుస వైఫల్యాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గుజరాత్‌లోని అహమ్మదాబాదులో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం గురంచి మరవక ముందే తాజాగా మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది.
Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!
శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబయికి వెళ్తున్న ఎయిరిండియా విమానం (ఏఐ180) విమానం సోమవారం అర్థరాత్రి 12:45 గంటలకు కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో విమానంలోని ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది భద్రతా కారణాలతో ప్రయాణీకులను విమానం నుంచి దించేశారు. అనంతరం మరమ్మత్తులు చేపట్టారు. అయితే విమానంలో తలెత్తిన సమస్యను పరిష్కరించి తిరిగి ప్రయాణీకులను గమ్య స్థానానికి చేర్చారా? లేదా అనే విషయాలు తెలియరాలేదు.
Also read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Follow Us