/rtv/media/media_files/2025/09/18/air-india-flight-crash-2025-09-18-14-51-13.jpg)
Air India crash victims' families sue aerospace firms Boeing and Honeywell
ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ విమాన తయారీ సంస్థ బోయింగ్‌కు బిగ్ షాక్ తగలింది. ఈ ప్రమాదంలో మరణించిన వాళ్లలో నాలుగు బాధిత కుటుంబాలు ఆ కంపెనీపై మంగళవారం అమెరికాలో దావా వేశాయి. ఆ పిటిషన్‌లో విడిభాగాల తయారీ సంస్థ హనీవెల్ పేరును కూడా చేర్చాయి. విమానంలో ఇంధన స్విచ్‌లు సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు చేశాయి.
Also Read: లక్షల ఓట్లు తొలగించారు ..ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
787 డ్రీమ్‌లైనర్ విమానం డిజైన్,అలాగే దాని విడిభాగాలు అభివృద్ధి చేసేటప్పుడే లోపాలు ఏంటో వాళ్లకి తెలుసని.. అయినప్పటికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డాయి. ఇంధన సరఫరా, విమాన థ్రస్ట్ నియంత్రణకు సంబంధించిన డిజైన్‌లో లోపం ఉన్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలను అడ్డుకునేందుకు ఆ రెండు సంస్థలు కూడా ఎలాంటి జాగ్రత్తుల తీసుకోకుండా నిర్లక్ష్యం వహించాయని ఆరోపించాయి.
Also Read: జపాన్‌లో లక్ష మందికి 100 ఏళ్లకు పైగా ఆయుష్షు.. వాళ్ల హెల్త్ సీక్రెట్ ఏంటో తెలుసా?
స్విచ్‌లను చెక్ చేయడం, అలాగే మరమ్మతులు చేయించడం అవసరమని విమానాయాన సంస్థలను కూడా హెచ్చరించలేదని ఆరోపించారు. వాటిని రీప్లేస్ చేయడం కోసం అవసరమయ్యే విడిభాగాలు పంపించడంలో ఆ రెండు కంపెనీలు కూడా నిర్లక్ష్యం వహించాయని పేర్కొన్నాయి. అయితే ఆ నాలుగు కుటంబాలు వేసిన పిటిషన్‌పై బోయింగ్, హనీవెల్ సంస్థలు ఇప్పటిదాకా స్పందించలేదు. ఇదిలాఉండగా ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ ఫ్లైట్ మధ్యాహ్నం సమయంలో టేకాఫ్ అయ్యింది. అది టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే సమీపంలోని ఓ మెడికల్ కాలేజ్ భవనంపై కుప్పకూలింది. విమానంలో 242 మంది ఉండగా 241 మంది మృతి చెందారు.
Also Read: శబరిమలలో 4.5 కిలోల బంగారం మాయం.. హైకోర్టు దర్యాప్తుకి ఆదేశం
ఏ11 సీట్‌పై కూర్చున్న ఒకే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అలాగే కళాశాల మెస్‌లో భోజనం చేస్తున్న విద్యార్థులు, పలువురు స్థానికులు సహా మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఈ విమాన ప్రమాదంలో 260 మంది మృతి చెందడం కలకలం రేపింది. ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తమ దర్యాప్తులో వెల్లడించింది. మరోవైపు బోయింగ్ విమానాల్లోని ఇంధన కంట్రోల్ స్విచ్‌లు కరెక్ట్‌గానే ఉన్నాయని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. అయితే తాజాగా నాలుగు బాధిత కుటుంబాలు బోయింగ్, హనీవెల్ సంస్థలపై కోర్టులో దావా వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
The fatal Air India crash that killed 260 people has led to a US lawsuit against Boeing and Honeywell, alleging faulty fuel switches caused the tragedy@BislaDiksha reports pic.twitter.com/0S2iFLvG1N
— WION (@WIONews) September 18, 2025
Also Read: ఉత్తరాఖండ్ లో మళ్ళీ క్లౌడ్ బరస్ట్..చమోలీ జిల్లాలో 10 మంది గల్లంతు