Sanjay Kapoor: మరణించే ముందు విమాన ప్రమాదంపై సంజయ్ కపూర్ పోస్ట్
నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ తన మరణానికి కొన్నిగంటల ముందు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై బాధను వ్యక్తం చేశారు. ‘‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బాధిత కుటుంబాలందరికీ నా సంతాపం. ఈ సమయంలో దేవుడు వారికి బలాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు.