ఏపీలో ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాద ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడిక్కడే మరణించారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేశారు.