న్యూయర్‌ వేడుకల వేళ విషాదం.. 10 మంది మృతి

కొత్త సంవత్సరం వేళ అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనం జనాలపైకి దూసుకెళ్లడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. లూసియానాలోని న్యూ ఆర్లీన్స్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది.

New Update

కొత్త సంవత్సరం వేళ అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనం జనాలపైకి దూసుకెళ్లడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.  లూసియానాలోని న్యూ ఆర్లీన్స్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. మరో 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. రోడ్డుపై ఓ వాహనం వేగంగా దూసుకురాగా అందులో డ్రైవర్ బయటకు వచ్చి జనాలపై కాల్పులు జరిపాడని అక్కడి స్థానిక మీడియా తెలిపింది. 

ఇక వివరాల్లోకి వెళ్తే.. న్యూ ఆర్లీన్స్‌లో కెనాల్ అండ్ బోర్డన్‌ స్ట్రీట్‌ కూడలిలో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. వేడుకల్లో పాల్గొనేందుకు అక్కడికి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. ఇదే సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. అందులో నుంచి బయటకు వచ్చిన డ్రైవర్‌ అక్కడి జనసమూహంపై కాల్పులు జరిపాడు. దీంతో 10 మంది మృతి చెందగా.. దాదాపు 30 మంది గాయాలపాలయ్యారు. ఆ తర్వాత పోలీసులు డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు