ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కుసుమ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా కుప్పకూలడంతో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఒక్కసారిగా కుప్పకూలడానికి కారణం ఏంటి అనే కోణంలో విచారణ చేయనున్నారు.
Mungeli, Chhattisgarh: A major accident occurred at the under-construction Kusum plant, where more than 30 people were buried under debris due to the collapse of an under-construction chimney. Police and administrative teams are on the spot, working to rescue the people trapped… pic.twitter.com/qeSf9FMsxZ
— IANS (@ians_india) January 9, 2025
ఇది కూడా చూడండి: Vykunta Ekadasi 2025: ముక్కోటి ఏకాదశి నాడు ఇలా పూజిస్తే పుణ్యమంతా మీకే
సూర్యాపేట జిల్లాలో జాతీయ రహదారిపై..
ఇదిలా ఉండగా.. ఇటీవల సూర్యాపేట జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Putrada Ekadashi 2025: పౌష పుత్రద ఏకాదశి రోజు .. ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని సంఘటనలు !
ట్రావెల్స్ బస్సు ఖమ్మం మీదుగా ఒరిస్సా నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బస్సు టైరు పేలడంతో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు మొదలు పెట్టారు.
ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయమే.. కానీ ఒక్క విషయంలో మాత్రం..
ఇది కూడా చూడండి: Vykunta Ekadasi 2025: తెరుచుకున్న తిరుమల వైకుంఠ ద్వారాలు