కాళేశ్వరం ఇంజినీర్ ఇంట్లో ఏసీబీ రైడ్స్ | ACB Raids In Kaleswaram Engineer Sridhar House | KCR | RTV
తెలంగాణలో బుధవారం ఉదయాన్నే ఏకకాలంలో వేర్వేరు 12 చోట్ల ఏసీబీ దాడులకు దిగింది. ఇరిగేషన్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (SE)గా పని చేసిన నూనె శ్రీధర్‌కు సంబంధించిన ఆస్తులపై ఏసీబీ రైడ్స్ చేసింది. నూనె శ్రీధర్‌పై ఆధాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లక్షల జీతాలు తీసుకుంటున్న కొంతమంది అధికారులు లంచాలకు మరిగారు. చిన్న చిన్న పనులకే వేలాది రూపాయలు లంచాలు వసూలు చేస్తూ కోట్లకు పరుగెడుతున్నారు. తాజాగా ఇద్దరు అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించి వారిని కటకటాల్లోకి తోశారు సామాన్యులు.
రంగారెడ్డి జిల్లాలో నీటిపారుదల శాఖలో పెద్ద తిమింగలం దొరికింది ఏసీబీకి. ఆ శాఖకు చెందిన ఏఈఈ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇతని ఆస్తి దాదాపు రూ.150 కోట్లకు పైనే ఉండొచ్చని అంటున్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి పలు అంతర్గత బదిలీలను నిర్వహించారు. సరుకుల నిలువలలో తేడాలు రాగా గోదాం పర్యవేక్షకుడు నరసయ్యను విధుల నుంచి తప్పించారు.
రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. ధరణి పోర్టల్ లో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించడానికి ఆయన రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించడంతో వారు స్కెచ్ వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15 మంది ఏసీబీ సిబ్బంది పలు ఫైళ్లను పరిశీలిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల కబ్జా విషయంలో జోగి రమేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు అయ్యింది.