ACB RAIDS: ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగళాలు

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లక్షల జీతాలు తీసుకుంటున్న కొంతమంది అధికారులు లంచాలకు మరిగారు. చిన్న చిన్న పనులకే వేలాది రూపాయలు లంచాలు వసూలు చేస్తూ కోట్లకు పరుగెడుతున్నారు. తాజాగా ఇద్దరు అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించి వారిని కటకటాల్లోకి తోశారు సామాన్యులు.

New Update
ACB RAIDS

ACB RAIDS

ACB RAIDS: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లక్షల జీతాలు తీసుకుంటున్న కొంతమంది అధికారులు అవి చాలవన్నట్లులంచాలకు మరిగారు. చిన్న చిన్న పనులకే వేలాది రూపాయలు లంచాలు వసూలు చేస్తూ కోట్లకు పరుగెడుతున్నారు. వారి ఆగడాలను చూస్తూ వదిలేసేది కొందరైతే, మరికొందరు వారి ఆట కట్టిస్తున్నారు. తాజాగా ఇద్దరు అధికారులను ఏసీబీకి పట్టించి వారిని కటకటాల్లోకి తోశారు.

  పత్తి పంట కూపన్ల కోసం లంచం.. 

రైతు అంటేనే రాబడి లేని జీవితం..పంట చేతికొచ్చేదాకా గ్యారంటీలేదు. అతివృష్టి, అనావృష్టి ఏదైనా రైతుకే నష్టం. ఒకవేళ పంట పండినా గిట్టుబాటు ధర దక్కుతుందో లేదో కూడా తెలియదు. అలాంటి అన్నదాత దగ్గర లంచం డిమాండ్ చేశాడో ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వం ఇస్తున్న జీతం సరిపోదన్నట్లు రైతు కష్టార్జీతంపై ఆశపడ్డాడు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల వ్యవసాయ అధికారి డి. శాంతన్ కుమార్.

Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్
 
ఎండ,వానలకు వెరువక రైతు పండించిన పంటను అమ్ముకోవడానికి లంచం డిమాండ్ చేశాడు శాంతన్ కుమార్. రైతు పండించిన పత్తిపంటను అమ్ముకోవడానికి అవసరమైన కూపన్ల జారీకోసం లంచం డిమాండ్ చేశాడు. దీంతో కడుపు మండిన రైతు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో రైతు నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఇది కూడా చదవండి: క్షమించండి.. ఇకపై అలాంటి సినిమాలు చేయను.. విశ్వక్ సేన్ సంచలన ప్రకటన!

ఏసీబీ వలలో TSCCDCL ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 

 
తీసుకున్న ప్రభుత్వ జీతానికి న్యాయం చేయకపోగా లంచాలకు అలవాటు పడిన అధికారులు జైలు పాలవుతున్నారు.. అయినా  ఇతర అధికారుల తీరు మారటం లేదు. తాజాగా తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ(TSCCDCL)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బొప్పూరి ఆనంద్ కుమార్  ఏసీబీ వలకు చిక్కాడు.  హైదరాబాద్, మసబ్ ట్యాంకులో పనిచేసే ఆనంద్ కుమార్‌ 

Also Read: Eknath Shinde: ఏక్‌నాథ్ షిండేను చంపేస్తాం, బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపులు


 ఓ ఫిర్యాదు దారుడికి సంబంధించిన రూ.33లక్షల బిల్లును ప్రాసెస్ చేయడానికి రూ.1,33,000  డిమాండ్ చేశాడు. అందులో భాగంగా లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇంత పెద్ద ఎత్తున లంచం తీసుకోవడంతో ఆయనపై అనుమానం వచ్చిన అధికారులు మరిన్ని సోదాలు జరుపుతున్నారు. ఆయన ఇంటితోపాటు మాసబ్ ట్యాంక్ లోని తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి కార్యాలయంలో సోదాలు జరుపుతున్నారు.  

Also Read: America: పనామా హోటల్‌ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు