Telangana Elections 2023: తెలంగాణలో ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. ఈరోజు నుంచి 30వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. మద్యం దుకాణాలు, బార్లు మరో రెండు రోజుపాటు మూతపడనున్నాయి. తాజాగా ఎన్నికల తనిఖీల్లో వేరు వేరు ప్రాంతాల్లో భారీగా మద్యం, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య మాట్లాడుతూ.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు రూ.63 కోట్లు విలువ చేసే లిక్కర్, ఆభరణాలు, నగదు సీజ్ చేసినట్లు వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలో 2400 నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశామన్నారు. గత పది రోజుల్లోనే 2.50 లక్షల వాహనాలు తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో 7 జోన్లలో 1600 మందిపై రౌడీషీట్లు ఉన్నాయి, వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు.
ALSO READ: ఓటు వెయ్యకపోతే సచ్చిపోతా.. కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
వరంగల్ లో మద్యం పట్టివేత:
పోలీసుల తనిఖీల్లో వరంగల్ రాయపర్తి మండలం కిష్టాపురం వద్ద భారీగా మద్యం పట్టుబడింది. వాహనంలో తరలివస్తున్న రూ.8 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ నుంచి తొర్రూరు వైపు డీసీఎంలో మద్యం తరలిస్తుండగా పట్టుకున్నారు.
మంచిర్యాల జిల్లాల..
మంచిర్యాల జిల్లాలోని సున్నంబట్టివాడలో భారీగా నగదు పట్టుకున్నారు పొలిసు అధికారులు. కారులో తరలిస్తున్న రూ. 15.81 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగదును సీజ్ చేసినట్లు వెల్లడించారు.