ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి

ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 

New Update
Syam Benagal1

Syam Benagal1 Photograph: (Syam Benagal1)

ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్(90) కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో 1934లో శ్యామ్ బెనగల్ జన్మించారు. శ్యామ్ బెనగల్ భారతీయ చలన చిత్రరంగంలో విశేష కృషి చేశారు. సికింద్రాబాద్ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చ‌దివిన శ్యామ్ బెనగల్ ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి ఎంఏ ఎక‌నామిక్స్ ప‌ట్టా పొందారు. 

ఇది కూడా చూడండి:  Baby Bump: పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్.. చైనాలో కొత్త ట్రెండ్

18 జాతీయ అవార్డులు..

శ్యామ్ బెనగల్‌కి ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో పాటు సినిమా రంగంలో మరికొన్ని అవార్డులను అందుకున్నారు. భారత జాతీయ సినిమా అవార్డుల్లో ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ దర్శకుడిగా అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయన సినిమాలకు మొత్తం 18 జాతీయ అవార్డులు దక్కాయి. సినీ ఇండస్ట్రీలో శ్యామ్ బెనగాల్ చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ పురష్కారం, 1991లో పద్మ భూషణ్‌తో సత్కరించింది. 

ఇది కూడా చూడండి: YEAR ENDER 2024: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే!

ఇది కూడా చూడండి: Food Allergy: ఫుడ్‌ అలర్జీ డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

అనంత్ నాగ్, షబానా అజ్మీ ప్రధాన పాత్రల్లో నటించిన అంకుర్‌ సినిమాతో 1974లో బెనెగల్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో.. బెనగల్ సినీ కెరీర్ ఒక మలుపు తిరిగింది. ఈ చిత్రం రెండవ ఉత్తమ జాతీయ చలనచిత్ర అవార్డు కూడా గెలుచుకుంది. ఆ తర్వాత నిశాంత్, మంతన, భూమిక వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు