Turkiye Blast: తుర్కియేలో భారీ అగ్ని ప్రమాదం..  12 మంది మృతి

తుర్కియేలో ఆయుధ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో 12 మంది మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పేలుడు ఎందువల్ల జరిగిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
Turkiye's blast

Turkiye's blast Photograph: (Turkiye's blast)

తుర్కియేలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆయుధ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బల్కిసెర్ ప్రావిన్స్‌లోని కవక్లి పట్టణంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి కంపెనీ పూర్తిగా ధ్వంసమైంది. 

ఇది కూడా చూడండి: అశ్విన్‌ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే! 

పూర్తిగా కుప్పకూలడంతో..

ఫ్యాక్టరీలోని ప్రధాన భవనం పూర్తిగా కుప్పకూలడంతో పాటు గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు కాలిపోయాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశాయి. ఈ కంపెనీలో మందుగుండు, ఇతర ఆయుధాలు తయారు చేస్తుంటారు. అయితే ప్రమాదంఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియదు. ఈ పేలుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించమని ఆ దేశ మంత్రి తెలిపారు. 

ఇది కూడా చూడండి: Allu arjun: అల్లు అర్జున్ విచారణ పూర్తి.. కీలక ప్రశ్నలకు సమాధానాలివే!

ఇది కూడా చూడండి: Jani Master: అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్ వైరల్

ఇది కూడా చూడండి: AP: ఏపీలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణి మృతి..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు