సంధ్య థియేటర్ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నిన్న (ఆదివారం) ప్రెస్‌మీట్ పెట్టారు. ఇందులో నేషనల్ మీడియాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నేషనల్ మీడియా మద్దతు ఇస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సీవీ ఆనంద్ వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి.
తాజాగా దీనిపై స్పందించిన సీవీ ఆనంద్.. మీడియాకు క్షమాపణలు చెప్పారు. నేషనల్ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. సంధ్య థియేటర ఘటనపై నేషనల్ మీడియా అడిగిన ప్రశ్నలకు సహనాన్ని కోల్పోయినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రెస్ మీట్‌లో సీవీ ఆనంద్ ఏమన్నారంటే..?
సంధ్య థియేటర్ ఘటనపై మాట్లాడిన సీపీ సీవీ ఆనంద్.. సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని తెలిపారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు సీపీ సమాధానాలు చెప్పారు. అలాగే సినిమా చూశాకే వెళ్తానని అల్లు అర్జున్ తనతో చెప్పాడని చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్ తెలిపారు.
Also Read: ధమ్ బిర్యానీలో బ్లేడ్.. హాస్పిటల్ పాలైన కస్టమర్!
'డిసెంబరు 4న రాత్రి అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్‌ని కలిసి తొక్కిసలాటలో మహిళ చనిపోయారు. బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పింది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించాం. అయినా.. మేనేజర్ మమ్మల్ని అల్లు అర్జున్ వద్దకు వెళ్లనివ్వలేదు. అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్లి విషయం అల్లు అర్జున్‌కు చెప్పాం.
సినిమా చూసిన తర్వాతే వెళ్తానని చెప్పారు. 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత డీసీపీ ఆదేశాల మేరకు అల్లు అర్జున్‌ను బయటకు తీసుకొచ్చాం’ అని చిక్కడపల్లి ఏసీపీ స్పష్టంగా వివరించారు. ఈ ప్రెస్ మీట్ అనంతరం మీడియా పలు ప్రశ్నలు అడగడంతో సహనం కోల్పోయిన సీవీ ఆనంద్ నేషనల్ మీడియా ఈ ఘటనకు మద్దతిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
CV Anand Apology: అల్లు అర్జున్ ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. సారీ చెప్పిన హైదరాబాద్ సీపీ!
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. నేషనల్ మీడియాను ఉద్దేశించి ఆదివారం తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ట్వీట్ చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు.
cv anand apology Photograph: (cv anand apology)