TG: పల్లెపోరు..మూడో దశలోనూ కాంగ్రెస్ దే హవా
తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో ఈ రోజు చివరి విడత పోలింగ్ జరిగింది. ఈ మూడో దశలోనూ కాంగ్రెస్ మద్దతుదారులే విజయం సాధించారు. మొత్తం 4,158 స్థానాల్లో ఎక్కువ చోట్ల గెలిచి ఆధిక్యాన్ని చాటారు.
తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో ఈ రోజు చివరి విడత పోలింగ్ జరిగింది. ఈ మూడో దశలోనూ కాంగ్రెస్ మద్దతుదారులే విజయం సాధించారు. మొత్తం 4,158 స్థానాల్లో ఎక్కువ చోట్ల గెలిచి ఆధిక్యాన్ని చాటారు.
తెలంగాణలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. 12,782 మంది సర్పంచి పదవులకు, 71,071 మంది వార్డు సభ్య స్థానాలకు పోటీ పడుతున్నారు.
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలోనూ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈ విషయమై SEC కసరత్తు ప్రారంభించింది. అ మేరకు ఉన్నతాధికారులతో SEC కమిషనర్ నీలం సాహ్ని సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పటికీ ఎన్నికల ఖర్చుకోసం ప్రభుత్వం ఇంతవరకు నిధులు కేటాయించకపోవడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.పైసా ఇవ్వకుండా ఎన్నికలు ఎలా నిర్వహించడమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జోరందుకుంటున్నాయి. వేలంపాట ద్వారానో, ఊర్లో స్కూల్, ఆలయాలు ఇతర నిర్మాణాలు చేస్తామని, గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తిచేస్తామనే హామీతోనో పలు గ్రామాల్లో అభ్యర్థులు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు.
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు ఎర్పాటు చేస్తాయి. మరోవైపు గ్రామంలో పన్నుల ద్వారా నిధులు సమకూరుతాయి.
ఒకప్పుడు పెద్ద పెద్ద లీడర్లుగా ఎదిగినవారంతా తమ రాజకీయ ప్రస్థానాన్ని సర్పంచ్‌స్థాయి నుంచి ప్రారంభించినవారే. వీరిలో చాలామంది ఎన్నిక లేకుండానే ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తరువాతి కాలంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా కూడా పనిచేశారు.