Panchayat Elections: గ్రామాల్లో హామీల హోరు..  ఏకగ్రీవాల జోరు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జోరందుకుంటున్నాయి. వేలంపాట ద్వారానో, ఊర్లో స్కూల్‌,  ఆలయాలు ఇతర నిర్మాణాలు చేస్తామని, గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తిచేస్తామనే హామీతోనో పలు గ్రామాల్లో అభ్యర్థులు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు.

New Update
Local body Election

A chorus of promises in the villages.. The power of unity

Panchayat Elections: గ్రామ పంచాయతీ ఎన్నిక(gram panchayat election 2025)ల్లో ఏకగ్రీవాలు జోరందుకుంటున్నాయి. లక్షల్లో వేలంపాటలు పాడుతున్నారు. వేలంపాట ద్వారానో, ఊర్లో స్కూల్‌,  ఆలయాలు ఇతర నిర్మాణాలు చేస్తామని, గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తిచేస్తామనే హామీతోనో, ఒక్కరే నామిషన్‌ వేయడంతోనో పలు గ్రామాల్లో అభ్యర్థులు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏకగ్రీవాల కోసం పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.  తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో 10 గ్రామ పంచాయతీలు, కామారెడ్డి జిల్లాలో ఐదు గ్రామపంచాయితీలు ఏకగ్రీవమైతే ఇందులో వర్ని మండలంలోనే ఎనిమిది ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది.

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం శివారు రాంరెడ్డిపల్లిలో సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధరణి లక్ష్మి తనను ఎన్నుకొంటే గ్రామంలోని అంతర్గత రహదారులు, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేస్తానని హామీ ఇవ్వడంతో  గ్రామస్తులు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 22 గ్రామాలు, నిర్మల్‌ జిల్లాలో ఎనిమిది గ్రామాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. ఇక మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేటలో.. పార్టీలకు అతీతంగా ముదిరాజ్‌ కులస్థులు  అంతా ఏకమయ్యారు. తమకు ఎప్పుడూ అవకాశం రాలేదని, అందుకే ఈసారి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలంటూ హేమ దుర్గపతి అనే వ్యక్తిని సర్పంచ్‌ అభ్యర్థిగా నిలబెట్టారు. panchayat elections 2025

మిగతా జిల్లాలకు భిన్నంగా ఖమ్మం జిల్లాలో వేలంపాట రహితంగా ఆరు గ్రామాలు, జనగామ జిల్లాలో ఆరు, వరంగల్‌ జిల్లాలో ఐదు, మహబూబాబాద్‌ జిల్లాలో మూడు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు, ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లాలో ఒక గ్రామం చొప్పున ఏకగ్రీవం కావడం గమనార్హం.  నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చిన్న అడిశర్లపల్లి గ్రామంలో అభ్యర్థి వెంకటయ్య రూ.51.3 లక్షలతో ఊర్లో బొడ్రాయి ప్రతిష్ఠతో పాటు శివాలయం నిర్మిస్తానని మాటివ్వడంతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గుర్రంపోడు మండలం ములకలపల్లిలో అభ్యర్థి బొడ్డు లింగస్వామి రామాలయం నిర్మాణానికి ముందుకురాగా ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు.

Also Read :  తిరుపతిలో మృతదేహాలు కలకలం...!

కోతుల బెడద తీర్చితే..

ఇక గ్రామాల్లో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బెడద ఎంత తీవ్రంగా ఉందంటే కోతుల బెడద తీర్చినవారిని గ్రామ సర్పంచ్‌గా ఎన్నుకుంటామనేంత. అవును మంచిర్యాల జిల్లా దండేపల్లి ప్రజలు ఈ  డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో సోమవారం ప్లకార్డులు పట్టుకొని మరీ.. కోతులు, కుక్కల బెడద తీర్చిన వారికే ఓటేస్తాం అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ఊర్లో ఉదయం సాయంత్రం సమయాల్లో కోతులు, కుక్కలు గుంపు గుంపులుగా వచ్చి ప్రజలపై దాడి చేస్తున్నాయని,  వాటి దాడుల్లో ఇటీవల పలువురు గాయపడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే వాటి బెడద తీర్చిన వారికే ఒటేస్తామంటున్నారు.

ఎన్నికల కోసం అమెరికా వదిలి

గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎక్కడెక్కడివారినో గ్రామాలకు రప్పిస్తున్నాయి. తాజగా నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లి గ్రామానికి చెందిన కమతం నందిని శ్రీనివాస్‌ రెడ్డి అనే మహిళ ఎన్నికల్లో పోటీ చేయడానికి అమెరికా నుంచి వచ్చింది. ఆమెకు ముగ్గురు పిల్లలుండగా వారంతా అమెరికాలో స్థిరపడ్డారు. ఓ ఆరేళ్లు పిల్లల వద్దే ఉంటానని ఆమె ఇటీవల అమెరికా వెళ్లిపోయింది. అయితే సర్పంచ్‌ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌ జనరల్‌కు కేటాయించడం, ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడంతో నందిని హుటాహుటిన అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌గా నామినేషన్‌ వేయడం విశేషం.

Also Read :  తెలంగాణపై   దిత్వా ఎఫెక్ట్..రెండు రోజులు భారీ వర్షాలు

Advertisment
తాజా కథనాలు