/rtv/media/media_files/2025/12/14/telangana-gram-panchayat-polls-2025-2025-12-14-14-46-28.jpg)
Telangana gram panchayat Polls-2025
తెలంగాణలో కాంగ్రెస్ చాలా గట్టిగా పాతుకుపోయింది. దీనికి నిదర్శనమే తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికలు. మూడు దశల్లో జరిగిన ఈ పల్లెపోరులో అన్ని సార్లూ కాంగ్రెస్ మద్దుతుదారులే పైచేయి సాధించారు. మిగతా పార్టీ ఎక్కడా తమ దరిదాపుల్లో కూడా చేరుకోలేని అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
మూడో విడతలోనూ..
ఈరోజు జరిగిన మూడో విడ ఎన్నికల పోలింగ్ లో కూడా ఇదే రిజల్ట్ వచ్చింది. మొత్తం మొత్తం 4,158 స్థానాల్లో ఎక్కువ చోట్ల గెలిచి ఆధిక్యాన్ని చాటారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాల్‌పల్లి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 1850 స్థానాలు, బీఆర్ఎస్ 960, బీజేపీ 180, ఇతరులు 390 స్థానాల్లో గెలుపొందారు.
మూడో దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా.. అందులో 11 సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 287, బీఆర్‌ఎస్ 42, బీజేపీ 9, ఇతరులు 57 స్థానాల్లో ఉన్నారు. రెండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. మిగిలిన 3,752 సర్పంచి పదవులకు 12,652 మంది పోటీ చేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. భోజన విరామం తర్వాత పోలింగ్ అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రాత్రి ఎనిమిది గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది.
త్వరలో సీఎం సమావేశం..
ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన కొత్త సర్పంచులతో త్వరలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇవాళ తుది విడత పంచాయితీ ఎన్నికల తరువాత ఈ నెల 20న సర్పంచుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో సర్పంచులతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించారు. సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళడం, సంస్థాగతంగా కాంగ్రెస్ క్యాడర్ ను బలోపేతం చేయడం వంటి అంశాలపై సర్పంచులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
Follow Us