సోమవారం పార్లమెంటులో విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2024-25 బడ్జెట్ సమావేశానికి ముందు కేంద్ర ఆర్థికశాఖ ఆధ్వర్యంలో జరిగిన హల్వా వేడుకలపై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జరిగిన సంప్రదాయ హల్వా వేడుక ఫొటోలను ప్రదర్శించారు. ఆ ఫొటోలో ఒక్క ఓబీసీ, దళిత, గిరిజన అధికారి లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో 73 శాతం ఉన్న జనాభా ప్రజలకు ప్రాతినిధ్యం లేదని ఆరోపించారు. ఈ బడ్జెట్‌ను 20 మంది అధికారులు కలిసి తయారు చేశారని చెప్పారు. ఈ 20 మంది అధికారులు తయారుచేసింది హిందుస్థాన్ హల్వా అని.. 73 శాతం ప్రాతినిధ్యం లేని హల్వా అంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. దీంతో కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ .. తన రెండు చేతులతో తలను పట్టుకున్నారు. ఆమె ఇలా తలను పట్టుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Hon’ble Finance Minister Ms. Nirmala Seetharaman must apologize to the SC/ST/OBC n minorities for being insensitive during the discussion on the deprivation of rights of these people!
அத்துணை இளக்காரம்!
மாண்புமிகு நிதி அமைச்சரே SC/ST/OBC n சிறுபான்மையினரிடம் மன்னிப்பு கேளுங்கள்! pic.twitter.com/7aB5AzvW74— Vellore Congress Sevadal (@SevadalVEL) July 29, 2024
#WATCH | In Lok Sabha, LoP Rahul Gandhi shows a poster of the traditional Halwa ceremony, held at the Ministry of Finance before the Budget session.
He says, “Budget ka halwa’ is being distributed in this photo. I can’t see one OBC or tribal or a Dalit officer in this. Desh ka… pic.twitter.com/BiFRB0VTk3
— ANI (@ANI) July 29, 2024
Also Read: వయనాడ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మోదీ!
అలాగే ఇద్దరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు దేశంలో మౌలిక సదుపాయాలను కంట్రోల్ చేస్తున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే సభలో వ్యాపారవేత్తల పేర్లు ప్రస్తావించడంపై స్పీకర్ ఓం బిర్లా (Om Birla) అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల వాదనలతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. రాహుల్ గాంధీకి సభా నియమాలు తెలియవంటూ విమర్శలు గుప్పించారు. దీనికి బదులిచ్చిన రాహుల్.. అధికార పక్ష నేతల వ్యవహారశైలికి అనుగణంగానే తాము స్పందిస్తామని తేల్చి చెప్పారు.
అలాగే 2024 బడ్జెట్లో మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను మోసం చేసిందని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండెక్సేషన్ బెనిఫిట్స్‌ను తొలగించిన ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేయిన్ ట్యాక్స్ (LTCG) పెంచడం దారుణమంటూ ధ్వజమెత్తారు.