2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వివిధ రంగాలన్నింటికీ కలిపి మొత్తం రూ.48.21 లక్షల కోట్ల కేటాయింపులు చేశారు. అయితే తెలంగాణకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని వెస్ట్రన్ కోర్టులో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సమావేశం అయ్యారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఏపీ విభజన చట్టంలో తెలగాణకు రావాల్సిన నిధులు, హక్కుల కోసం పోరాటం చేయాలని.. ఇందుకోసం బధవారం పార్లమెంట్లో నిరసన చేయాలని నిర్ణయించుకున్నారు.
పూర్తిగా చదవండి..Telangana: బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం.. కాంగ్రెస్ ఎంపీలు కీలక నిర్ణయం
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలగాణకు జరిగిన అన్యాయంపై, రావాల్సిన నిధులపై బుధవారం పార్లమెంట్లో నిరసన చేయాలని నిర్ణయించుకున్నారు.
Translate this News: