Popcorn: పాప్‌కార్న్‌ ప్రియులకు బిగ్ షాక్.. రుచిని బట్టి 3రకాల GST!

పాప్‌కార్న్‌ ప్రియులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పాప్‌కార్న్‌పై 3 రకాల జీఎస్టీ విధించబోతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఉప్పు, సుగంధ ద్రవ్యాలకు 5, ఉప్పు, మసాలా దినుసులకు 12, స్వీట్ పాప్‌కార్న్‌పై 18శాతం పన్ను వర్తిస్తుందని పేర్కొన్నారు.

author-image
By srinivas
New Update
popcorn

popcorn Photograph: (popcorn )

GST On Popcorn: పాప్‌కార్న్‌ ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. భార్య, పిల్లలు లేదా స్నేహితులతో కలిసి థియేటర్‌లో సరదాగా ఆస్వాదించే పాప్ కార్న్ మరింత ఖరీదైనదిగా మారనుంది. ఈ మేరకు దేశంలో పాప్‌కార్న్‌పై మూడు రకాల పన్నులు విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విభిన్న రుచుల ఆధారంగా జీఎస్టీ నిర్ణయించనున్నట్లు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఆమె అధ్యక్షతన జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేశారు. 

3 రకాల జీఎస్టీ రేట్లు..

ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ రుచి ప్రకారం పాప్‌కార్న్‌ను వివిధ స్లాబ్‌లలో చేర్చింది. మార్కెట్‌లో లభించే రుచులను బట్టి పాప్‌కార్న్‌పై 3 రకాల జీఎస్టీ రేట్లను విధించేందుకు కౌన్సిల్ అంగీకరించింది. చక్కెర, ఉప్పు, మసాలాలతో కూడిన పాప్‌కార్న్‌పై పన్ను విధించబడుతుంది కౌన్సిల్ సమావేశంలో పేర్కొన్నారు. ఇక రెడీ-టు-ఈట్ పాప్‌కార్న్‌పై పన్ను రేట్లకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించారు. సాధారణ ఉప్పు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడి పాప్ కార్న్‌పై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఉప్పు, మసాలా దినుసులతో కూడిన పాప్ కార్న్ లేబుల్ చేసి విక్రయిస్తే 12శాతం జీఎస్టీ ఉటుంది. పంచదార వంటి తీపి పదార్థాలతో తయారు చేయబడిన పాప్‌కార్న్‌పై 18 శాతం చొప్పున జీఎస్టీ విధించబోతున్నట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Pawan kalyan: ఏపీకి రండి.. సినీ పెద్దలకు పవన్ కళ్యాణ్ పిలుపు!

55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాప్‌కార్న్‌పై జీఎస్‌టీకి సంబంధించి మాత్రమే కాకుండా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. EV, పెట్రోల్, డీజిల్ కార్లను రీసెల్ చేసే కంపెనీ/రిజిస్టర్డ్ యూజ్డ్ కార్ల విక్రేత మార్జిన్ ధరపై 18 శాతం GST చెల్లించాలి. వ్యక్తిగత కొనుగోలుదారు లేదా విక్రేతకు ఇది 12% మాత్రమే ఉంటుందని తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు