Union Budget: కేంద్ర బడ్జెట్ తేదీ ఖరారు !
కేంద్ర బడ్జెట్ 2024 విడుదలకు తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. జులై 22న పూర్తికాల యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
కేంద్ర బడ్జెట్ 2024 విడుదలకు తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. జులై 22న పూర్తికాల యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
బీజేపీ ఎంపీ నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సాధించారు. మోదీ కేబినెట్లో మూడుసార్లు మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎంపీ మహిళగా నిలిచారు. 2014లో వాణిజ్య, 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. 2024లో కూడా మూడోసారి మంత్రిగా ప్రమాణం చేశారు.
ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్రునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఎన్నికల బాండ్ల పథకాన్ని పునరుద్ధరిస్తామని కేంద్రమంతి నిర్మలా సీతారామన్ అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది.
నిధుల కేటాయింపు విషయంలో సౌత్ ఇండియా ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ వస్తుందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ దేశంలో ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని మండిపడ్డారు.